మహర్షి కాంబో మళ్లీ రిపీట్

Friday,January 10,2020 - 12:32 by Z_CLU

మహేష్ కెరీర్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మహర్షి. ఎందుకంటే అది సూపర్ స్టార్ 25వ చిత్రం కాబట్టి. అలాంటి పెద్ద బాధ్యతను సక్సెస్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి. మహర్షితో మెమొరబుల్ హిట్ అందుకున్న మహేష్, వంశీపై చాలా నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే ఇప్పుడు వంశీకి మరో ఛాన్స్ వచ్చేలా చేసింది.

అవును.. మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని నిన్న జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ బయటపెట్టాడు. సినిమా జానర్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. త్వరలోనే వంశీ పైడిపల్లి ఫుల్ నెరేషన్ తో వస్తాడని మాత్రం స్పష్టంచేశాడు.

రేపు థియేటర్లలోకి రాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత 3 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు మహేష్. ఈ గ్యాప్ లో వంశీ పైడిపల్లితో సినిమా ఫైనల్ చేస్తాడు. ఒక్కసారి స్క్రీన్ ప్లే లాక్ చేస్తే ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవడమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ నుంచి వంశీ పైడిపల్లి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.