జై లవకుశ ఫస్ట్ లుక్.. సింప్లీ సూపర్బ్

Friday,May 19,2017 - 03:34 by Z_CLU

యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న పండగ రానే వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, చెప్పినట్టుగానే సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు జై లవకుశ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లుక్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాను కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. అయితే అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఒక లుక్ తోనే సరిపెట్టలేదు.. ఏకంగా 2 స్టిల్స్ రిలీజ్ చేశారు.

టైటిల్ లోగో కాన్సెప్ట్ నే ఫస్ట్ లుక్ లో కూడా కొనసాగించారు. ఎన్టీఆర్ కారు దిగుతున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం రావణాసురుడి ఉగ్రరూపాన్ని అలానే ఉంచారు. ఇక యంగ్ టైగర్ గెటప్ విషయానికొస్తే.. బ్లాక్ డ్రెస్ లో, గాగుల్స్ పెట్టుకున్న ఎన్టీఆర్ అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా మీసం మెలితిప్పిన ఎన్టీఆర్ గెటప్ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.