దంగల్ చైనా వసూళ్లు 1000 కోట్లు

Thursday,June 01,2017 - 05:45 by Z_CLU

మరో సంచలన రికార్డు క్రియేట్ చేసింది దంగల్. చైనాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. యూనివర్సల్ కంటెంట్, కనెక్టింగ్ ఇమోషన్స్, పర్ ఫెక్ట్ ప్లానింగ్ లో జరిగిన ప్రమోషన్స్ రీజన్స్ ఏవైతేనేం అమీర్ ఖాన్ ‘దంగల్’ చైనాలోనూ బాక్సింగ్ ఆడేస్తుంది.

చైనాలో రిలీజైన ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న ‘దంగల్’ ఆ తరవాత చైనీస్ సోషల్ మీడియాలోను ఓ రేంజ్ లో భారీ ఎత్తున స్పేస్ ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు చైనా సూపర్ స్టార్స్ వరకు ఈ సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం సినిమాని సక్సెస్ జోన్ లో నిలబెట్టింది. నితేష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కిన దంగల్, ఇప్పటికీ అదే స్పీడ్ లో ప్రదర్శించబడటం విశేషం.