సెలెబ్రేషన్స్ క్యాన్సిల్ చేసుకున్న నిఖిల్

Thursday,June 01,2017 - 06:20 by Z_CLU

పర్ ఫెక్ట్ సక్సెస్ ట్రాక్ లో ఉంది నిఖిల్ కరియర్. ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం సక్సెస్ గ్యారంటీ హీరోల్లో నితిన్ ఒకడు. స్వామి రారా నుండి మొదలైతే రీసెంట్ గా రిలీజైన కేశవ వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్లీ లోడెడ్ జోష్ లో నిఖిల్, దర్శక రత్న దాసరి గారి మరణం తో ఈ రోజు ఫ్యాన్స్ మధ్య జరుపుకున్న సంబరాలను క్యాన్సిల్ చేసేశాడు. ఆ విషయాన్ని స్వయంగా లెటర్ రాసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

‘స్వామి రారా’ సినిమాతో పాటు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ 50 డేస్ పండగను గురువుగారు స్వయంగా పిలిచి మరీ సెలెబ్రేట్ చేసిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్న నితిన్, ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేనిది అంటూ లెటర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

 

 

నిన్న థియేటర్స్ తో పాటు, షూటింగ్స్ కి కూడా బంద్ ప్రకటించిన టాలీవుడ్, దాసరి నారాయణ రావు గారి స్మృతిలో మ్యాగ్జిమం అకేషన్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు.