స్పైడర్ చుట్టూ అనుమానాలు

Thursday,June 01,2017 - 04:50 by Z_CLU

స్పైడర్ టీజర్ రిలీజయింది. సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేస్తున్న ఈ టెక్కీ టీజర్, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడమే కాదు, దాని చుట్టూరా రకరకాల క్వశ్చన్స్ ని రేజ్ చేస్తుంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడే స్పై థ్రిల్లర్ అని క్లారిటీ ఇచ్చినా, ఈ టీజర్ లో హైలెట్ అయిన రోబో స్పైడర్ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఇంతకీ ఈ స్పైడర్ ఏంటి..? అది జస్ట్ టీజర్ కోసం ప్లాన్ చేసిన ఎలిమెంటా..? లేకపోతే సినిమాలో కూడా దీనికి రోల్ ఉంటుందా..?

మహేష్ బాబు ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. సో డెఫ్ఫినేట్ గా బోలెడంత ఇంటెలిజెన్సీ, కావలసినంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి లాంటి హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని ప్యాక్ చేసుకుని మరీ రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఈ రోజు సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ‘స్పైడర్’, టీజర్ లో మహేష్ బాబునే కాదు, టీజర్ చూసిన ఫ్యాన్స్ ని కూడా డిస్టబ్ చేయడం బిగిన్ చేసేసింది. దాంతో సినిమాపై ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న క్యూరాసిటీ డోసు మరింత పెరిగిపోయింది.

 

స్పైడర్ సినిమా మ్యాగ్జిమం టెర్రరిజం పై బేస్డ్ అయి ఉంటుందని సినిమా బిగిన్ అయినప్పటి నుండే స్ట్రాంగ్ టాక్ నడుస్తుంది. కానీ టీజర్ లో మహేష్ బాబు కంప్యూటర్ ముందు కూర్చుని ఏం చేస్తున్నాడు..? ‘స్పైడర్’ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరా..? ఇంతకీ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్న రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది..? ఇలా పెద్ద క్వశ్చన్ బ్యాంక్ నే రిలీజ్ చేసిన ఈ టీజర్, ‘స్పైడర్’ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.