ఆ రెండు కుటుంబాలు కలుస్తున్నాయి

Wednesday,May 20,2020 - 12:24 by Z_CLU

రీసెంట్ గా రానా తన లవ్ మేటర్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. మిహికా బజాజ్ అనే అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు రానా. ఈలోగా ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి.

ఈరోజు దగ్గుబాటి ఫ్యామిలీ, బజాజ్ కుటుంబాలు ఫార్మల్ గా మీట్ అవుతాయి. హైదరాబాద్ లోని సురేష్ బాబు ఇంట్లోనే ఈ గెట్ టుగెదర్  ఏర్పాటైంది. దాదాపు ఓ 20 మంది వరకు కలవబోతున్నారట. అయితే చాలామంది దీన్ని నిశ్చితార్థ వేడుక అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు.

బజాజ్ కుటుంబానికి రామానాయుడు, సురేష్ బాబుతో పరిచయాలున్నాయి. ఈ జనరేషన్ కు చెందిన రానా లాంటి కుర్రాళ్లతో పరిచయం లేదు. ఇటు దగ్గుబాటి కుటుంబానికి కూడా బజాజ్ ఫ్యామిలీ నుంచి కొద్దిమంది మాత్రమే పరిచయం. అందుకే ఒకర్నొకరు పరిచయం చేసుకునేందుకు, పెళ్లికి సంబంధించిన మాటలు మాట్లాడుకునేందుకు ఈ మీటింగ్.

ఈ ఏడాదిలోనే రానా-మిహికా పెళ్లి జరిపిస్తామని సురేష్ బాబు ప్రకటించారు. ఆల్రెడీ పెళ్లి పనులు స్టార్ట్ అయిన విషయాన్ని కూడా బయటపెట్టారు.