NTR బర్త్ డే స్పెషల్

Sunday,May 20,2018 - 10:02 by Z_CLU

యంగ్ టైగర్ NTR.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘జై లవకుశ’ తరవాత ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సెట్స్ పై ఉన్నాడు. 2 భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తరవాత ప్రస్తుతం సినిమాలోని కీ సిచ్యువేషన్స్ తెరకెక్కించే ప్రాసెస్ లో  బిజీగా ఉన్నాడు. అయితే సరిగ్గా ఇదేరోజు 1983 లో పుట్టిన NTR ఈ రోజు తన 35 వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

ఎంట్రీ తోనే స్టార్ రేంజ్ : 2001 లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన NTR, అదే సంవత్సరం రిలీజైన స్టూడెంట్ నం 1, సుబ్బు సినిమాలతో ఫ్యాన్స్ గుండెల్లో పర్మనెంట్ గా సెటిలైపోయాడు.

కమర్షియల్ హీరో : కేవలం 5 ఏళ్ళు సరిపోయాయి NTR ఆల్ రౌండర్ స్టార్ అని నిరూపించుకోవడానికి. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆది’ NTR ని కంప్లీట్ కమర్షియల్ గా ఎస్టాబ్లిష్ చేస్తే, అదే సంవత్సరం రిలీజైన ‘అల్లరి రాముడు’ NTR ని ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేశాయి. ఆ తరవాత రిలీజైన ‘సింహాద్రి’ NTR లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లా నిలిచింది.

ప్రతీది డిఫెరెంటే : 2006 లో రిలీజైన అశోక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ నుండి ఫ్యాన్స్ బయట కూడా పడలేదు. అప్పుడే భారీ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘రాఖీ’, NTR లోని నట విశ్వరూపాన్ని ప్రెజెంట్ చేసింది.  ఆ తరవాత వరసగా రిలీజైన యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం.. ఇలా చెప్పుకుంటూ పోతే వేటికదే స్పెషల్. ప్రతీది డిఫెరెంట్.

స్టైల్ చేంజ్ : 2012 లో రిలీజైన ‘దమ్ము’ సినిమాతో అన్ని క్యాటగిరీ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసిన NTR చిన్నగా ప్రయోగాలపై దృష్టి పెట్టాడు. అటు యాక్షన్ కి స్కోప్ ఇస్తూనే, క్లీన్ కామెడీ ట్రాక్ ని ప్రిఫర్ చేసిన NTR, బాద్ షా సినిమాతో టోటల్ గా మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా తరవాత రిలీజైన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాలో ఇన్నోసెంట్ పని వాడిలా NTR కామిక్ పర్ఫామెన్స్  ఫ్యాన్స్ డైరీలో ఆల్ టైమ్ ఫేవరేట్ లిస్టులో నిలిచిపోయింది.

 

ఎక్స్ పెక్ట్ చేయని ఆంగిల్స్ : 2015 లో రిలీజైన ‘టెంపర్’ లో NTR చేసింది పెద్ద ప్రయోగమే. ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో డిఫెరెంట్ లుక్ లో మోస్ట్ స్టైలిష్ అవతార్ లో సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా, కంప్లీట్ టాలీవుడ్ ని ఇమోషనల్ ఫేజ్ లో ముంచేసింది.

టార్గెట్ అదే.. : సినిమా సక్సెస్ అవుతుందా..?  ఫ్లాపవుతుందా  లాంటి  మీటర్స్  కాకుండా  మ్యాగ్జిమం  ఫ్యాన్స్ ని మెస్మరైజ్  చేయడమే  టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంటాడు NTR. ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’ సినిమాల సక్సెస్ ఆ విషయాన్ని ప్రూఫ్ చేశాయి.

ఇప్పుడు సెట్స్ పై ఉన్న త్రివిక్రమ్ సినిమా పై కూడా NTR ఫ్యాన్స్ లో భారీ రేంజ్ బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తోడు NTR బర్త్ డే సందర్భంగా నిన్న రిలీజైన టైటిల్ పోస్టర్, ఒక్కసారిగా సినిమా పై హెవీ స్టాండర్డ్స్ సెట్ చేశాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని అదే స్థాయిలో రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఉంది కంప్లీట్ సినిమా యూనిట్.

చేసే ప్రతి సినిమాతో ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతూ, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో దూసుకుపోతున్న NTR, ఇంకెన్నో హైట్స్ రీచ్ అవ్వాలని, ఇంలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.