క్రిస్ప్ రన్ టైమ్ తో వస్తున్న సుబ్రహ్మణ్యపురం

Tuesday,December 04,2018 - 12:34 by Z_CLU

ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేయాలంటే కంటెంట్ క్రిస్పీగా ఉండాలి. స్క్రీన్ ప్లే తో ఎంటర్ టైన్ చేసినప్పుడే థ్రిల్లర్ లో కిక్. అలాంటి కిక్ ను హండ్రెండ్ పర్సెంట్ అందించడానికి రెడీ అయింది సుబ్రహ్మణ్యపురం.

సుమంత్, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిడివి కేవలం 132 నిమిషాలు. అంటే సరిగ్గా 2 గంటల 12 నిమిషాలన్నమాట. ఎలాంటి డీవియేషన్స్ కు పోకుండా, కేవలం స్క్రీన్ ప్లే పై డిపెండ్ అయి ఇలా తక్కువ రన్ టైమ్ తో వస్తోంది సుబ్రహ్మణ్యపురం.

సుమంత్ కెరీర్ లో మొట్టమొదటి థ్రిల్లర్ ఇది. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’ పతాకంపై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.