వీకెండ్ రిలీజ్

Tuesday,December 04,2018 - 10:02 by Z_CLU

వరల్డ్ వైడ్ గా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది 2.0. లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ తరవాత ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించే పనిలో ఉంది. మరో వైపు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు, కాన్ఫిడెంట్ గా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. వాటి వివరాలివే.

సుబ్రహ్మణ్యపురం :  సుమంత్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ థ్రిల్లింగ్ జోనర్ లో నటించడం. ట్రైలర్ తోనే మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేసింది. ‘సుబ్రహ్మణ్యపురం’ లో ఉన్న గుడికి, వరస హత్యలకి మధ్య ఉన్న మిస్టరీ ఈ సినిమాలో హై పాయింట్. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియెన్స్ కి ఫీస్ట్ లాంటి సినిమా సుబ్రహ్మణ్యపురం. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7 న రిలీజవుతుంది.

నెక్స్ట్ ఏంటి : నవదీప్, సందీప్ కిషన్ హీరోలుగా మెచ్యూర్డ్ బోల్డ్ ఎలిమెంట్స్ తో లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నెక్స్ట్ ఏంటి. ఈ సినిమాలో తమన్నాదే కీలక పాత్ర. ఒక అమ్మాయి వేసుకునే బట్టల్ని బట్టి ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంటారు జనాలు. కానీ అది కాకుండా ఇంకేదో ఉంటుంది. దానికి తోడు పాస్ట్ లో ఉండే పర్సనల్ రిలేషన్ షిప్స్ కూడా అమ్మాయిల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అనేది ఈ సినిమాలో హై పాయింట్. డిసెంబర్ 7 న రిలీజవుతుంది ఈ సినిమా.

కవచం : పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లర్ ‘కవచం’. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ గెటప్ లో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాడనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏ మాత్రం  స్టోరీ  రివీల్  చేయకుండా   సస్పెన్స్    మెయిన్   టైన్  చేస్తున్న  ఫిల్మ్  మేకర్స్, అగ్రెసివ్ ప్రమోషన్స్ తో  సినిమాని వైడ్ రేంజ్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. డిసెంబర్ 7 ఈ సినిమా రిలీజ్ డేట్.

శుభలేఖ+లు : ఒక పెళ్లింట్లో జరిగే 2 ప్రేమ కథల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిందే శుభలేఖలు+. శరత్ నర్వాడే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవారే. డిసెంబర్ 7 న రిలీజవుతుంది శుభలేఖ+లు.