క్రేజీ డైరెక్టర్స్... డిన్నర్ విశేషాలు

Tuesday,June 05,2018 - 03:06 by Z_CLU

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ రాజమౌళి, సుకుమార్,కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి,హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్  నిన్న రాత్రి ఓ డిన్నర్ మీట్ అరేంజ్ చేసుకున్నారు… డిన్నర్  అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

“నిన్న రాత్రి వంశీ , సుకుమార్ వల్ల ఇలా అందరం కలుసుకున్నాం. చాలా రోజుల తర్వాత కలవడంతో  కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. అయితే కొరటాల , హరీష్ చెప్పిన కథలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను… వాళ్ళు చెప్పిన కథలు మమ్మల్ని  తెల్లవారే వరకూ నవ్వుకునేలా చేసాయి.” అంటూ రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఫోటో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇక రాజమౌళి పోస్ట్ ను రిట్వీట్ చేస్తూ “నిన్న రాత్రి  గొప్పగా గడిచింది.. దీనికి కారణమైన వంశీ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల. సో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ ఈ విధంగా నిన్న రాత్రి పండగ చేసుకుని కాసేపు ఆనందంగా గడిపారన్నమాట.