నిర్మాత 'శివలెంక కృష్ణ ప్రసాద్' ఇంటర్వ్యూ

Tuesday,June 05,2018 - 06:41 by Z_CLU

సుదీర్ బాబు,అదితి రావు జంటగా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సమ్మోహనం’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 15 న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

చాలా ఏళ్ల తర్వాత

నిర్మాతగా మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేయాలనుకున్నప్పుడు.. నేను మొదట కలిసింది ఇంద్రగంటి మోహన కృష్ణ గారినే.. నా దగ్గర ఒక కథ ఉందని నచ్చితే ఆ కథతో సినిమా చేద్దామని చెప్పాను. ఆయన సరే అన్నారు. రైటర్ ని పిలిపించి కథ వినిపించాను. ఆయనకీ కూడా బాగా నచ్చడంతో ఆ సినిమా చేసాం. అదే జెంటిల్ మెన్ సినిమా.. ఆ కథను చాలా గొప్పగా రూపొందించి మా సంస్థ కి చాలా ఏళ్ల తర్వాత ఓ సూపర్ హిట్ అందించాడు మోహన కృష్ణ.

ముందు అనుకున్న కథ ఇదే

ఇంద్రగంటి గారితో సినిమా చేద్దామనుకున్నప్పుడు ఆయన నాకో కథ చెప్పారు. ఆ కథ నాకు బాగా నచ్చింది. కానీ ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాకపోవడంతో జెంటిల్ మెన్ కథతో సినిమా చేసాము. అలా అప్పుడు ఆయన చెప్పిన కథే ‘సమ్మోహనం’ అప్పటి నుండి ఈ కథ నా మైండ్ లో ఉండి పోయింది. సినిమా రంగానికి సంబందించిన కథే అయినప్పటికీ సినిమా ఎవరినీ నొప్పించదు.

క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకుంది

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ముందు… మేం ముందుగా అదితి రావు హైదరినే హీరోయిన్ గా అనుకున్నాం. ఈ క్యారెక్టర్ కి అదితి అయితే బాగుంటుందని మోహన్ గారు చెప్పారు. ఆ తర్వాత నేను మణిరత్నం గారి సినిమా చూడటం..ఆమె కి కథ వినిపించడం.. తెలుగులో నేను ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆమె కూడా అనుకోవడంతో ఫైనల్ గా అదితి సెలెక్ట్ చేసాం. చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తెలుగులో కూడా బిజీ అవుతుందనుకుంటున్నా.

టైటిల్ పెట్టింది ఆయనే

సినిమా చక్కగా ఇంటిల్లిపాదిటి చూసే విధంగా ఉంది కాని దీనికి ఒక మంచి టైటిల్ పెట్టాలని అనుకుంటున్నప్పుడు మోహన్ గారే ఈ టైటిల్ పెడదామని చెప్పారు. వినగానే ఒక మంచి పాజిటీవ్ ఫీల్ కలిగింది. అందరికీ నచ్చడంతో  ఫిక్స్ చేసేసాం.

సినిమాకి అవసరమైతే

శ్రీదేవి మూవీస్ నిర్మాణ విలువలంటే అందరూ ‘ఆదిత్య 369’ గురించే మాట్లాడతారు కానీ.. మేము నిర్మించిన ప్రతీ సినిమాకి అవసరమైనంత ఖర్చు పెట్టాం. సినిమాకి అవసరమైతే ఖర్చు పెట్టడానికి ఎప్పుడూ వెనకాడలేదు. అందుకే మా బ్యానర్ సినిమాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమా కి కూడా ఎక్కడ వెనకాడకుండా ఖర్చుపెట్టాం. సినిమాకి పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ పై కనిపస్తుంది.

 

సుదీర్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది 

సినిమాలంటే చులకన భావం కలిగిన పాత్రలో సుదీర్ నటించాడు. సుదీర్ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది. ముఖ్యంగా అదితి , సుదీర్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయి.

బాలయ్య తో సినిమా చేస్తా…కానీ

మా బ్యానర్ లో సినిమా చేయడానికి బాలకృష్ణ గారు ఎప్పుడు సిద్దమే.. మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్నాం. కానీ కుదరలేదు. కచ్చితంగా మా కాంబినేషన్ లో త్వరలోనే సినిమా ఉంటుంది. అది ఎదేప్పుడనేది మాత్రం ఇంకా తెలియదు.

ఆయనతో కమర్షియల్ సినిమా చేయాలనుంది.

ఇంద్రగంటి గారు మంచి సెన్సిబుల్ ఉన్న దర్శకుడు.. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఆయనతో పక్క కమర్షియల్ సినిమా నిర్మించాలనుంది. అవకాశం వస్తే కచ్చితంగా మోహన్ తో అలాంటి సినిమా నిర్మిస్తా.

మహేష్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు

ఈ నెల 10 న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇన్వైట్ చేశాం. కానీ ఆయన బయటికి వెళ్ళడంతో… ఇంకా  క్లారిటీ ఇవ్వలేదు. ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ వివరాలు తెలియజేస్తాం.

బలాన్నిచ్చింది

సినిమా చూసాక చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా మళ్ళీ నాకు బలాన్నిచ్చిన సినిమా ‘సమ్మోహనం’. కుటుంబమంతా కలిసి చూసే ఒక మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తి ఉంది. రేపు విడుదలయ్యాక ప్రేక్షకులు అలాగే ఫీలవుతారని ఆశిస్తున్నాను.