టీజర్ తో ఎట్రాక్ట్ చేస్తున్న గోపీచంద్

Tuesday,June 05,2018 - 01:28 by Z_CLU

గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘పంతం’ టీజర్ రిలీజైంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే.కే. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాతో చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతుంది.

“చెప్పుకోవడానికి నేను కొత్త కథ కాదు…దేశం పుట్టినప్పటి నుండి మనం చెప్పుకునే కథే..” అంటూ గోపి చంద్ పాయింట్ అఫ్ వ్యూ లో స్టార్ట్ అయిన ఈ టీజర్  గోపీచంద్ స్టన్స్ ..పవర్ ఫుల్ యాక్షన్ తో కూడిన షాట్స్ తో పాటు కోర్ట్ లో పవర్ డైలాగ్ తో సినిమాపై క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. రచయిత నుండి దర్శకుడిగా మారిన చక్రవర్తి టీజర్ లో తన డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసాడు.

గోపీచంద్ సరసన మేహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ ఫినిష్ చేసుకొని సాంగ్స్ షూట్ జరుపుకుంటుంది.