'2.0' కౌంట్ డౌన్ మొదలైంది

Tuesday,November 20,2018 - 11:01 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులంతా ఎదురుచూస్తున్న ‘2.0’ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా  శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మాణంలో 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది.

ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు.  ఆదివారం ఈ సినిమా మేకింగ్ వీడియోస్‌, పాట‌, ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు.  పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా `2.0`.

ఈ సినిమాను తెలుగులో ఎన్‌.వి.ఆర్‌ సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. `2.0` పాట‌లు, ట్రైల‌ర్‌ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. సోష‌ల్ మీడియాలో 2.0 ట్రైల‌ర్‌, పాట‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.