'భైరవగీత' రిలీజ్ డేట్

Tuesday,November 20,2018 - 10:02 by Z_CLU

ధనంజయ, ఇర్రా మోర్ జంటగా నటించిన  ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  తెలుగు , కన్నడ భాషలలో   నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మించారు.