Theaters Re-Open - 24 కండీషన్స్

Tuesday,October 06,2020 - 06:48 by Z_CLU

Covid19 లాక్ డౌన్ కారణంగా మూతబడిన సినిమా హాళ్ళు మళ్ళీ రీ ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల 15 నుండి థియేటర్స్ లో సినిమాలు వేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి థియేటర్స్ యాజమాన్యానికి 24 కండీషన్స్ పెట్టింది కేంద్రం. తాజాగా ఈ కండీషన్స్ లెటర్ ను థియేటర్స్ మేనేజ్మెంట్ కి అందజేసారు.

థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ వాడాలని మాస్క్ లేకుండా వచ్చే ప్రేక్షకులకు టికెట్ అమ్మకూడదని , అలాగే థియేటర్స్ యాజమాన్యం PPE కిట్స్ కచ్చితంగా వాడాలని , ప్రేక్షకులకు హ్యాండ్ సానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని, 50 శాతం సీట్లకు సంబంధించి మాత్రమే టికెట్స్ విక్రయించాలని మిగతా సీట్లకు మార్క్ చేసి ఉంచాలని , అదే విధంగా ఎయిర్ కండీషన్ టెంపరేచర్ 24-30C రేంజ్ లోనే ఉంచాలని, ముఖ్యంగా థియేటర్స్ లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని , థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆడియన్స్ ను అనుమతించాలని , బాక్సాఫీస్ ను దగ్గర టికెట్ కౌంటర్లను రోజు మొత్తం ఓపెన్ చేసి ఉంచాలని పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని కండీషన్స్ చెప్తూ థియేటర్స్ మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేసింది కేంద్రం.