RRR Vs RadheShyam - ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్

Tuesday,October 06,2020 - 06:56 by Z_CLU

ప్రతీ హీరో నుండి అభిమానులు ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోరుకుంటారు. మిగతా హీరో సినిమా అప్డేట్ వచ్చినప్పుడల్లా తమ హీరో సినిమా ప్రొడక్షన్ హౌజ్ ని తమకి కూడా ఓ అప్డేట్ ఇవ్వమని కోరుతుంటారు. ప్రస్తుతం Prabhas Fans అదే చేస్తున్నారు. ఎప్పటి నుండో RRR ఎన్టీఆర్ టీజర్ కి సంబంధించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది.

దసరా కానుకగా అక్టోబర్ 22 న #RamarajuForBheem పేరుతో NTR వర్షన్ టీజర్ రిలీజ్ చేయబోతునట్లు ఓ భారీ మేకింగ్ వీడియో తో ప్రకటించారు. ఈ అప్డేట్ తో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

దీంతో ఇప్పుడు Prabhas ఫ్యాస్ రంగంలో దిగారు. Prabhas20 గా తెరకెక్కుతున్న #RadheshyamTeaser కి సంబంధించి తమకి కూడా ఓ అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. ట్విట్టర్ లో UV Creations ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేస్తూ తమ ఎదురుచూపులను తెలియజేస్తున్నారు. మరి రాధేశ్యామ్ నిర్మాతలు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎప్పుడు అప్డేట్ తో ఖుషి చేస్తారో చూడాలి.