Samantha - భర్తకు ప్రేమతో...!

Tuesday,October 06,2020 - 12:51 by Z_CLU

మంచి అకేషన్ దొరికినప్పుడల్లా భర్త నాగచైతన్య (NagaChaitanya)పై తన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది సమంత (Samantha). ఇప్పుడీ ముద్దుగుమ్మకు అలాంటిదే మరో సందర్భం దొరికింది. ఈరోజు నాగచైతన్య-సమంతల పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తకు శుభాకాంక్షలు చెబుతూ ఓ మంచి ఫొటో పోస్ట్ చేసింది సమంత.

సమంత-నాగచైతన్యకు పెళ్లయి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తవుతుంది. ఈ మూడేళ్లలో చైతూను మరింత అర్థం చేసుకున్నానని చెబుతున్న సమంత.. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇద్దరం కలిసి వాటిని ఎదుర్కొందాం అనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టింది.

ప్రస్తుతం నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ (Love Story Movie)ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చాడు. దీని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యు (Thank You Movie) అనే సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత పరశురామ్ సినిమా లైన్లో ఉంది.

ఇటు సమంత మాత్రం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం లైఫ్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదించే పనిలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తన కొత్త సినిమా డీటెయిల్స్ ను ఎనౌన్స్ చేయబోతోంది.