చుట్టాలొచ్చి 40 ఏళ్లు అయింది

Saturday,August 08,2020 - 05:50 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి చుట్టాలున్నారు జాగ్రత్త. పక్కా కమర్షియల్ మీటర్ లో తీసిన ఈ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లో సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ్టితో (ఆగస్ట్ 8) ఈ సినిమా విడుదలై సరిగ్గా 40 ఏళ్లు అయింది.

కృష్ణ ఏడాదికి 10 సినిమాలు చేస్తున్న టైమ్ అది. ఇక 1980 సంవత్సరంలో అయితే కృష్ణ నుంచి ఏకంగా 17 సినిమాలు రిలీజయ్యాయి. అలా Super Star Krishna Career లోనే బిజీ ఇయర్ గా నిలిచిన 1980లో చుట్టాలున్నారు జాగ్రత్త (Chuttalunnaru Jagratha) మూవీ విడుదలైంది.

ఆ ఏడాది కృష్ణ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అప్పటికే హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్న కృష్ణ-శ్రీదేవి జంటకు ఉన్న క్రేజ్ ను ఈ సినిమా డబుల్ చేసింది.

ఈ విషయాలన్నీ పక్కనపెడితే.. సిల్వర్ స్క్రీన్ పై సిసలైన కమర్షియల్ మూవీగా నిలిచింది ఇది. హీరోను మర్డర్ కేసులో ఇరికించడం, సరిగ్గా తనలాంటి వ్యక్తినే హీరో జైలులో కలవడం, ఇద్దరూ కలిసి నాటకమాడి అసలు నిజాన్ని బయటకు రాబట్టడం అనేది ఆ కాలంలో సూపర్ హిట్టయింది. ఈ ఫార్ములా ఎంత హిట్టయిందంటే.. దాదాపు ఇదే కాన్సెప్ట్ తో ఆ తర్వాత తెలుగులో ఓ వంద సినిమాలు వచ్చి ఉంటాయి. వాటన్నింటికీ మూలం ఈ Chuttalunnaru Jagratha.

తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమాను ఏపీఎం స్టుడియోస్ సంస్థ హిందీలో రజనీకాంత్ హీరోగా రీమేక్ చేసింది. ఇదే సినిమాను హిందీలో జితేంద్ర హీరోగా కూడా రీమేక్ చేశారు. ఈ రెండు రీమేక్స్ సూపర్ హిట్టయ్యాయి. అలా చుట్టాలున్నారు జాగ్రత్త కథ యూనివర్సల్ అప్పీల్ అందుకుంది. అన్ని భాషల్లో శ్రీదేవి నటించడం మరో విశేషం.

ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎమ్మెస్ విశ్వనాథన్ ఈ సినిమాకు అద్భుతమైన బాణీలు అందించారు. రెక్కలు తొడిగి రెపరెపలాడే అనే సాంగ్ వింటే ఇప్పటికీ ఆ కాలం జనాలు అన్నీ మరిచిపోతారు. దీంతో పాటు మిగతా పాటలన్నీ హిట్టయ్యాయి.

అమృతా ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సీనియర్ నటుడు బాలయ్య కథ-స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అలపర్తి సూర్యనారాయణ నిర్మించగా.. బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు.