మెగా కాంబినేషన్ ఫిక్స్ ... నిర్మాత ఎవరంటే?

Saturday,August 08,2020 - 07:02 by Z_CLU

 

కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరు లిస్టులో చాలా మంది దర్శకులున్నారు. అయితే వాటిలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్ సినిమా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన వేదాళం (VEDALAM ) సినిమాను Chiranjeevi హీరోగా మెహర్ రమేష్ రీమేక్ చేస్తారని టాక్.

ఆమధ్య Meher Ramesh తో ఓ సినిమా చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు చిరు. ఇప్పుడు ఆ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారట. ఈ కాంబో సినిమాను ఏ.కే..ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించే అవకాశం ఉంది..

అయితే చిరు ఈ సినిమాను Lucifer Remake తర్వాత చేస్తాడా లేదా ఈ Vedalam Remake నే ముందుకు తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.