చిరు వర్సెస్ నాగ్

Wednesday,August 31,2022 - 11:05 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి , కింగ్ నాగార్జున ఈ దసరా కి బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ , నాగ్ ‘ది ఘోస్ట్’ అక్టోబర్ 5న విజయదసమి స్పెషల్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. నిజానికి చిరు -నాగ్ క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ ఎంత క్లోజ్ అన్నది చాలా సందర్భాల్లో వాళ్ళే చెప్పుకున్నారు. నాగ్ కి  ఏ మాత్రం మూడ్ బాగాలేక పోయినా వెంటనే చిరు దగ్గరికి వెళ్లిపోతానని స్వయంగా ఆయనే చెప్పారు కూడా. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు తమ  అప్ కమింగ్ సినిమాలతో పోటీ పడబోతుండటం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఇటు ‘గాడ్ ఫాదర్’ , అటు ‘ది ఘోస్ట్’ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. రెండూ టీజర్స్ తో ఎట్రాక్ట్ చేశాయి. ఇక నాగ్ ది ఘోస్ట్ నుండి లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై హైప్ పెంచేసింది. ‘గాడ్ ఫాదర్’ నుండి టీజర్ మాత్రమే రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది.  లేటెస్ట్ గా చిరు -సల్మాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ వచ్చిన గ్లిమ్స్ ఎట్రాక్ట్ చేశాయి.

చిరు నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు కాగా ,నాగ్ ‘ది ఘోస్ట్’ కి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. చిరు -నాగ్ మధ్యే కాదు ఈ ఇద్దరి దర్శకుల మధ్య కూడా పోటీ ఉండబోతుంది. ఇద్దరూ తమ హీరోలను స్టైలిష్ గా నెవర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేసి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీశారు. మరి విజయదసమికి ఈ రెండు పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్ సాదించి ఇటు చిరు అటు నాగ్ ఇద్దరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఈ టైంలో ఈ బడా సినిమాలు థియేటర్స్ లో ఆడటం, భారీ వసూళ్ళు రాబట్టడం ఇండస్ట్రీ కి కూడా అవసరమే.