చిరు నెక్స్ట్ సినిమా హీరోయిన్

Friday,January 20,2017 - 09:06 by Z_CLU

మెగాస్టార్ 150 వ సినిమా రిలీజయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేశాడు చిరు. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్ముడు తగ్గనే లేదు. ఈ లోపు చిరు అకౌంట్ లో అపుడే కొత్త క్వశ్చన్స్ బ్యాంక్ అవుతున్నాయి. వాటిలో హై డిమాండ్ లో ఉన్న ట్రెండింగ్ క్వషన్ చిరు నెక్స్ట్ హీరోయిన్ ఎవరు..? ఇకపోతే ఫ్యాన్స్ తమ ఇమాజినరీ లిస్టు సేవ్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే…

1

ఖైదీ లో మెగా చాన్స్ కొట్టేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసిన కాజల్, చిరు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసే చాన్సెస్ చాలానే ఉన్నాయి. ఖైదీలో కాజల్ అప్పియరెన్స్ కి 150 మార్కులు వేసిన మెగాస్టార్, తన నేస్క్ట్ సినిమాలో చాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

2

టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అందునా బాహుబలి లాంటి భారీ సినిమాలో చేసిన అనుష్క చిరు పక్కన చేరాలి కానీ బాక్సాఫీస్ బద్దలు కావడం గ్యారంటీ.

3

మెగాస్టార్ తో గతంలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం కాస్తంత స్లో పేజ్ లో ఉన త్రిష బ్యాగ్ లో ఈ మెగాచాన్స్ కానీ పడితే, త్రిష మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే.

4

ప్రస్తుతం టాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ హీరోయిన్. గతంతో పోలిస్తే కాస్తంత ఖాళీగానే ఉన్నా, క్రేజ్ మాత్రం కించిత్ కూడా తగ్గలేదు అని GPS తో ప్రూఫ్ చేసుకుంది. మెగాస్టార్ లెవెల్ కి పర్ ఫెక్ట్ మ్యాచ్.

5

సిల్వర్ స్క్రీన్ కి నయనతార కొత్త కాకపోయినా చిరుతో స్క్రీన్ షేరింగ్ మాత్రం కొత్తే… 150 కి కాజల్ ఫస్ట్ టైం… 151 కి నయన్ ఫస్ట్ టైం లాంటి రైమింగ్ కి మెగా ఫ్యామిలీ ఫిక్సయితే… టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరితో చేసిన నయన్ అకౌంట్ లో మెగాస్టార్ ని మిస్ అయ్యానన్న వెలితి డిలీట్ అయిపోతుంది.

6

 బాలీవుడ్ లో టాప్ లిస్టులో ఉండే హీరోయిన్. మాస్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న ఈ స్ట్రాంగ్ హీరోయిన్ కానీ చిరుతో స్టెప్స్ వేస్తే… సినిమా సూపర్ హిట్టే.

7

తన బిజీ షెడ్యూల్స్ తో ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలీదు కానీ, గతంలో రజినీకాంత్ తో రోబోలో కనిపించిన ఈ విశ్వసుందరి, మెగా వెంచర్ కి సంతకం చేస్తే… సినిమా శుభం, లాభం, ఐశ్వర్యం అనిపించుకోవడం ఖాయం.

8

ఎన్ని సినిమాలు చేసిందీ అనే కన్నా ఎంత క్రేజ్ ని సంపాదించింది అంటే రాధికా ఆప్టేకి 100 కి 100 మార్కులు పడతాయి. సినిమా సినిమాకి సెన్సేషన్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకున్న రాధికా ఆప్టే, చిరు పక్కన చేరితే ఈ సారి మెగా సెన్సేషన్ గ్యారంటీ.

9

గతంలో శిరీష్ సరసన ఇప్పుడు మిస్టర్ లో వరుణ్ తేజ్ సరసన నటిస్తూ మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టేసిన లావణ్యకి, ఈ మెగా వెంచర్ లో చాన్స్ కొట్టేయడం పెద్ద కష్టమేం కాదు… అదే గనక జరిగితే లావణ్య లాంగ్ జంప్ కొట్టి, స్టార్ హీరోయిన్స్ రేస్ కి క్వాలిఫై అయిపోతుంది.

10

మరీ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ కాకపోయినా, గతంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న సర్టిఫికెట్ ఉంది కాబట్టి మెగా వెంచర్ కి నామినీ అవ్వడం ఈజీనే. మెగాస్టార్ సినిమా అంటేనే ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్, దానికి సోనాల్ కూడా చేరితే గ్లామర్ డోస్ డబల్ అయినట్టే.