సెట్స్ పైకొచ్చిన మెగా అల్లుడు

Wednesday,February 07,2018 - 01:45 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా ఈ సినిమా రానుంది. మూవీలో కల్యామ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. సెంథిల్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తణికెళ్ల భరణి, మురళీ శర్మ, సత్యం రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. యోగేష్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.