ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్

Wednesday,February 07,2018 - 02:03 by Z_CLU

ఈ వీకెండ్ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నటించిన సినిమాలతో పాటు సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమా వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్నాయి.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ఇంటిలిజెంట్. దర్శకుడు వీవీ వినాయక్, తేజూ కాంబోలో ఇదే మొదటి సినిమా. ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వినాయక్ ఈ సినిమా చేయడంతో ఇంటిలిజెంట్ పై అందరి కన్నుపడింది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది

ఇంటిలిజెంట్ తో పాటు థియేటర్లలోకి వస్తోంది గాయత్రి. హై-ఎండ్ ఎమోషన్స్ తో వస్తున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ పోషించారు. యంగ్ మోహన్ బాబుగా మంచు విష్ణు నటించాడు. శ్రియ, నిఖిలా విమల్ రెండు కీలక పాత్రలు పోషించారు. మదన్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9) గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

VarunTej-Tholiprema-stills-zeecinemalu

ఇంటిలిజెంట్, గాయత్రి సినిమాలు వచ్చిన 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి వస్తోంది తొలిప్రేమ. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా ఇది. వెంకీ అట్లూరి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్. ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.