ఫిబ్రవరి 23న "కణం" గ్రాండ్ రిలీజ్

Wednesday,February 07,2018 - 01:15 by Z_CLU

నాగశౌర్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కణం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని ఈనెల 23న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఏఎల్ విజయ్ ఈ సినిమాకు దర్శకుడు.

ప్రస్తుతం రజనీకాంత్ తో 2.0లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కణం చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. మంచి కాన్సెప్ట్ కావడంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని, అతి తక్కువ టైమ్ లో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కణం సినిమాను నిర్మించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్ వీ ఆర్ మూవీస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం తెలుగులో కొత్త కాన్సెప్టులు సక్సెస్ అవుతున్నాయి. సో.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కణం కూడా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు హీరో నాగశౌర్య. నాగశౌర్య, సాయిపల్లవి కాంబినేషన్ ఈ సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

సినిమాటోగ్రఫీ – నిరవ్ షా
సంగీతం – శామ్ సీఎస్
ఆర్ట్ – జయశ్రీ ఎల్
ఎడిటర్ – ఆంటోనీ
డైలాగ్స్ – సత్య
సాహిత్యం – కృష్ణ మదినేని
బ్యానర్ – లైకా ప్రొడక్షన్స్
దర్శకుడు – ఏఎల్ విజయ్