జపాన్ లో మెగా దంపతుల హాలిడే ట్రిప్

Thursday,April 04,2019 - 11:59 by Z_CLU

ప్రస్తుతం జపాన్ లో టూరిజంకు ఇది సరైన సీజన్. మరీ ముఖ్యంగా అక్కడ సకురా ఫెస్ట్ జరుగుతోంది. దీన్నే చెర్రీ బ్లోజమ్ ఫెస్ట్ అని కూడా అంటారు. చెర్రీ చెట్లు మొగ్గలు విచ్చుకునే సీజన్ ఇది.

మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో ప్రకృతి మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ఈ సమయంలో జపాన్ ను సందర్శిస్తుంటారు. మెగా దంపతులు కూడా వెళ్లారు.

సైరా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుశ్మితతో కలిసి జపాన్ వెళ్లారు. మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో సుకురా ఫెస్ట్ లో పాల్గొన్నారు. అందమైన ప్రకృతిని ఆస్వాదించారు.

 

జపాన్ పర్యటన ముగిసిన వెంటనే తిరిగి సైరా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి చైనాలో ఈ సినిమా షూట్ ప్లాన్ చేశారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.