మహేష్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

Thursday,April 04,2019 - 01:17 by Z_CLU

ప్రస్తుతం మహర్షి పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. ఓవైపు ఈ సినిమా పనులు చూసుకుంటూనే మరోవైపు తన నెక్ట్స్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టాడు. ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలలోనే మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. స్క్రీన్ ప్లేకు ఫైనల్ టచింగ్ ఇచ్చే పనిలో అనీల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

6 నెలల్లో ఈ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలాగైనా థియేటర్లలోకి రావాలనేది టార్గెట్. ఈ సంక్రాంతికి ఎఫ్-2లో బ్లాక్ బస్టర్ కొట్టిన అనీల్ రావిపూడి… వచ్చే సంక్రాంతికి కూడా రెడీ అయ్యాడన్నమాట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు.