Chiranjeevi Venky Kudumula - అఫీషియల్ ఎనౌన్స్ మెంట్

Tuesday,December 14,2021 - 05:35 by Z_CLU

DVV Danayya to produce a mega project with Chiranjeevi under the direction of Venky Kudumula.

చిరంజీవి అస్సలు తగ్గడం లేదు. వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు మెగాస్టార్.

అవును.. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య, ఈ ప్రాజెక్టుకు నిర్మాత.

చిరంజీవి అభిమానుల్లో ఒకడు వెంకీ కుడుముల. చిరంజీవి అభిమానిగా కంటే, ఆయనకు భక్తుడిగా చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు వెంకీ కుడుముల. అదే భక్తితో చిరంజీవి కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రాసి, మెగాస్టార్ ను మెప్పించాడు. అందుకే ప్రాజెక్ట్ ప్రకటన వెంటనే వచ్చేసింది.

chiranjeevi venky kudumula DVV Danayya

త్రివిక్రమ్ దగ్గర పని చేసిన వెంకీ కుడుముల, ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఆ తర్వాత భీష్మ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ డైరక్టర్. ఇప్పుడు తన మూడో సినిమాకే మెగాస్టార్ ను డైరక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు.

వెంకీ కుడుముల బలం కామెడీ. చిరంజీవి కోసం కూడా కచ్చితంగా కామెడీ సబ్జెక్ట్ రెడీ చేసి ఉంటాడు వెంకీ. అటు చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో.. ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండబోతోంది. ఓ మెగాస్టార్ భక్తుడు, చిరంజీవితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఈ సినిమాతో చూస్తారంటున్నాడు వెంకీ కుడుముల.

ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేసిన చిోరంజీవి.. ప్రస్తుతం భోళాశంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చారు. చిరు స్పీడ్ చూస్తుంటే.. వెంకీ కుడుముల సినిమా కూడా వీలైనంత త్వరగానే సెట్స్ పైకి వచ్చేలా ఉంది.