`రాజుగారి గది 3` రిలీజ్ డేట్ ఫిక్స్
Tuesday,October 08,2019 - 12:02 by Z_CLU
హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం `రాజుగారిగది`. ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం `రాజుగారిగది 3`. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమా నిర్మితమైంది. షబీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందని… సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయని అంటున్నాడు ఓంకార్. తన గత చిత్రాల్లోనే రాజుగారి గది-3 కూడా హిట్ అవుతుందంటున్నాడు.

నటీనటులు: అవికాగోర్, అశ్విన్ బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్, ఊర్వశి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఓంకార్
బ్యానర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిటర్: గౌతంరాజు
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: శ్రీమణి
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
స్టంట్స్: వెంకట్