విలన్ కాదు... బ్రదర్ కోసం వెయిటింగ్

Sunday,March 05,2017 - 02:04 by Z_CLU

సుకుమార్-రామ్ చరణ్ సినిమా కోసం ఆది పినిశెట్టి లేదా వైభవ్ లో ఒకర్ని తీసుకోవాలని అనుకుంటున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. వీళ్లలో ఒకర్ని చెర్రీ సినిమాలో విలన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్టు గాసిప్స్ రౌండ్స్ కొట్టాయి. అయితే వీళ్లలో ఒకర్ని తీసుకునే మాట నిజమే కానీ, అది విలన్ రోల్ కోసం కాదని తెలుస్తోంది. అవును.. చెర్రీకి అన్నయ్య పాత్ర కోసం వైభవ్ లేదా ఆది పేర్లను పరిశీలిస్తున్నారట. చరణ్ కంటే రెండేళ్లు పెద్దయిన అన్నయ్య పాత్ర కోసం వీళ్లలో ఒకర్ని తీసుకుంటారట. ప్రస్తుతం ఆది పినిశెట్టి డేట్స్ ఖాళీ లేవు. సో.. ఆల్ మోస్ట్ వైభవ్ పేరు పక్కా అయినట్టే.

ప్రస్తుతం ఈ సినిమాకు లొకేషన్లు వెదికే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. కథ డిమాండ్ ను బట్టి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో సినిమాను షూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లొకేషన్ల వేట పూర్తయిన వెంటనే.. విలన్ ఎవరనే అంశంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. సమంత హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ లాక్ చేశాడని టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 20నుంచి చెర్రీ-సుక్కూ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.