నారా రోహిత్ నుంచి ఇంకో సినిమా

Sunday,March 05,2017 - 03:25 by Z_CLU

గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం నారా రోహిత్ స్టయిల్. ఇప్పుడీ హీరో మరో సినిమా లాంచ్ చేశాడు. నారా రోహిత్ హీరోగా ఎస్.వి.ఎం.పి ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభమైంది. వీవీ వినాయక్ ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ సినిమాతో పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావుగారు కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ స్క్రిప్ట్ ను దర్శకుడు పవన్ కు అందించారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనుంది. “నరసింహ” చిత్రంలో నీలాంబరి పాత్ర తరహాలో ఈ క్యారెక్టర్ ఉంటుందట.

ఇక ఈ సినిమాతో నారా రోహిత్ సరసన మరోసారి రెజీనా హీరోయిన్ గా నటించనుంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి జ్యో అచ్యుతానంద సినిమా చేశారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో, సెంటిమెంట్ కొద్దీ తాజా ప్రాజెక్టులో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.