చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి మల్టీస్టారర్?

Sunday,November 19,2017 - 11:12 by Z_CLU

బాహుబలి సినిమాకోసం దాదాపు 5 ఏళ్ళు కేటాయించిన రాజమౌళి ప్రెజెంట్ నెక్స్ట్ సినిమా కి కాస్త గ్యాప్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?? అనే క్వశ్చన్ రెయిజ్ అవుతుంది. దీనికి కారణం రాజమౌళి నిన్న రాత్రి చరణ్ ఎన్టీఆర్ తో కలిసి సన్నిహిత్యంగా ఉన్న ఓ ఫోటో పెట్టడమే. ఈ ఫోటో చూసి అటు మెగా ఫాన్స్ తో పాటు ఇటు నందమూరి ఫాన్స్ కూడా ఖుషి లో మునిగిపోయారు. అయితే ఈ ఫోటో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో జక్కన్న ఈ ఇద్దరితో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడనే సంకేతాలు బయటపడ్డాయి.

మొన్నటి వరకూ నెక్స్ట్ సినిమాకు ఇంకా కథ దొరకలేదని చెప్పుకొచ్చిన జక్కన్న ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా కోసం రెడీ చేసుకున్నాడని, డి.వి.వి.దానయ్య నిర్మించనున్న ఈ సినిమాలో చరణ్ హీరోగా నటించనున్నాడని, సినిమాలో ఓ కీలక రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడని ఈ కాంబో ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.