ఇద్దరు యంగ్ హీరోలతో దిల్ రాజు

Sunday,November 19,2017 - 10:45 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నాని తో MCA సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే తన బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా స్టార్ట్ చేసిన దిల్ రాజు ప్రెజెంట్ మరో ఇద్దరు యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, నాని వంటి యంగ్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న దిల్ రాజు ప్రెజెంట్ నితిన్, రామ్ లతో ఓ రెండు సినిమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్న దిల్ రాజు మరో వైపు త్రినాధ్ రావు డైరెక్షన్ లో రామ్ తో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుందని త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయని సమాచారం. సో ఈ యంగ్ హీరోలతో దిల్ రాజు ఎలాంటి హిట్స్ సాదిస్తాడో..చూడాలి.