జూనియర్ శర్వానంద్ కోసం సెర్చింగ్

Monday,January 28,2019 - 02:02 by Z_CLU

మార్చి నుంచి 96 తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో కీలకమైన ఓ పని స్టార్ట్ చేశారు మేకర్స్. అదే జూనియర్ శర్వానంద్, జూనియర్ సమంతను వెదికిపెట్టే కార్యక్రమం. ఇందులో భాగంగా జూనియర్ శర్వానంద్ కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 14-20 ఏళ్ల వయసున్న అబ్బాయిలు తమ ప్రొఫైల్ పిక్స్ ను మెయిల్ చేయొచ్చు.

సినిమాలో పాస్ట్, ప్రెజెంట్ స్టోరీలు సైమల్టేనియస్ గా సాగుతుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలతో పాటు వాళ్లు చిన్నప్పటి లవ్ లైఫ్ కు సంబంధించిన ఎపిసోడ్ కూడా ఒకేసారి రన్ అవుతుంది. సినిమాకు చాలా కీలకమైన ఈ పాత్ర కోసం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది.

జూనియర్ శర్వానంద్ దొరికిన వెంటనే జూనియర్ సమంతను వెదికే పని స్టార్ట్ చేస్తారు. ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాకు ప్రేమ్ కుమార్ దర్శకుడు.