ఎక్స్ క్లూజివ్: '96'లో శర్వానంద్

Wednesday,December 19,2018 - 04:47 by Z_CLU

దాదాపు నెల రోజులుగా టాలీవుడ్ లో నలుగుతున్న 96 రీమేక్ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది. హీరో శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. పడి పడి లేచే మనసు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు శర్వా. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 రీమేక్ లో తను నటించబోతున్నానని ప్రకటించాడు.

 నిజానికి ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. తర్వాత బన్నీ కూడా ఈ ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ చూపించినట్టు వార్తలొచ్చాయి. కానీ అది కూడా ఫైనల్ కాలేదు. ఎట్టకేలకు శర్వానంద్ హీరోగా ఈ సినిమా పట్టాలపైకి రాబోతోంది.

 దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. పడి పడి లేచే మనసు సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన తర్వాత, సుధీర్ వర్మ డైరక్షన్ లో చేస్తున్న సినిమాను కంప్లీట్ చేస్తాడు శర్వానంద్. ఆ తర్వాత 96 రీమేక్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.