ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్లు వీళ్లే

Monday,January 28,2019 - 03:07 by Z_CLU

ఒకరు కాదు, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. వాళ్లలో ఒకర్ని ఫిక్స్ చేశారు. రీసెంట్ గా మరో ముద్దుగుమ్మను కూడా ఫైనలైజ్ చేశారు.

రామ్-పూరి జగన్నాధ్ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ లో ఉంది ఈ సినిమా. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నభా నటేష్ ను సెలక్ట్ చేశారు. ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తయింది.

అయితే నభా మెయిన్ హీరోయిన్ కాదు. ఆమెది సెకెండ్ హీరోయిన్ రోల్. మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనలైజ్ చేశారు. కొద్ది సేపటి కిందట ఈ విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రీసెంట్ గా మిస్టర్ మజ్ను సినిమా చేసింది నిధి. రామ్ సినిమా ఆమెకు తెలుగులో మూడోది.

పూరి-చార్మి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మే నెలలో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు.