టార్గెట్ రీచ్ అవుతాడా ?

Wednesday,March 06,2019 - 04:57 by Z_CLU

ప్రతీ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే నితిన్ ఈ ఏడాది మాత్రం మూడు నెలలు గడిచినా ఒక్క సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాలేదు. అసలు నితిన్  నెక్స్ట్ సినిమాలేంటి..? వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నానంటూ అనౌన్స్ చేసిన నితిన్ ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు.. అసలు ఈ ఏడాది నితిన్ నుండి ఒక్క సినిమా అయినా ఉంటుందా ..? అనే ప్రశ్నలకు ఫులిస్టాప్ పెట్టేసాడు యూత్ స్టార్.

నెక్స్ట్ సినిమాల గురించి  సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ స్క్రిప్టింగ్ స్టేజిలో ఉన్నాయని, ఈ నెలాఖరు లోపు వాటి వివరాలు తెలియజేస్తానని త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు నితిన్. అంతే కాదు ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ ఉంటాయని తెలిపాడు.

ఇప్పటికే ఏడాదిలో రెండు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం ‘భీష్మ’ సినిమా అనౌన్స్ మెంట్ స్టేజిలోనే ఉంది. మరొకటి అనౌన్స్ కావాల్సి ఉంది. మరి ఈ ఏడు నెలల్లో నితిన్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా..? చెప్పినట్టే రెండు సినిమాలను రిలీజ్ చేస్తాడా ..చూడాలి.