సైంటిస్ట్ గా నిధి అగర్వాల్

Wednesday,March 06,2019 - 04:30 by Z_CLU

హీరో రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ యాంగిల్ కూడా ఉందనే విషయాన్ని జీ సినిమాలు.కామ్ గతంలోనే వెల్లడించింది. ఇప్పుడదే నిజమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ పాత్ర వివరాలు బయటకొట్టాయి. సినిమాలో ఆమె సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతోంది.

తన కెరీర్ లో పూరి జగన్నాధ్ చేస్తున్న మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ సినిమా ఇదే. అటు పూరి-రామ్ కాంబోలో కూడా ఇదే తొలి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. మరో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసే డైరెక్ట‌ర్ పూరి.. రామ్‌ను కూడా స‌రికొత్త లుక్‌లో చూపిస్తున్నాడు. ఇప్ప‌టికే రామ్ లుక్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.