సి.కళ్యాణ్ సొంతమైన 'లక్ష్మి'

Sunday,August 05,2018 - 01:12 by Z_CLU

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్.. ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘లక్ష్మి’ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్-1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ  సినిమా లో  దిత్య  డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయి రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమా ఆడియో, రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ఆగష్టు 12 న ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగష్టు  24 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కోవై సరళ, సల్మాన్ యూసఫ్ ఖాన్,చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..  సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు..

తారాగణం: ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దివ్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్.

సాంకేతిక నిపుణులు:
రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్
నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్
బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్
సంగీతం: సామ్ సీఎస్
డీఓపీ : నీరవ్ షా
ఎడిటర్ : ఆంథోనీ