ఆగస్టు 24న 'అంతకు మించి' రాబోతోంది

Sunday,August 05,2018 - 01:03 by Z_CLU

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం “అంతకు మించి”. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర  విడుదల తేదీని ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతిచే ఎనౌన్స్ చేయించారు.

భూపతి మాట్లాడుతూ.. ”అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి.” అన్నారు.

దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ”మా సినిమా  ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.” అన్నారు.

హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ”అందరి ఎఫర్ట్ ఈ ‘అంతకు మించి’ సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా..” అన్నారు.

నటీనటులు: జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి ఎన్ ఆర్, మాధునందన్, హర్ష,
టెక్నీషియన్లు
మాటలు: మోహన్ చందా
సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి
ఎడిటర్: క్రాంతి(ఆర్ కె)
సంగీతం: సునీల్ కశ్యప్
ఆర్ట్: నాగు
కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం
నిర్మాత: సతీష్, ఎ. పద్మనాభ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.