దేవదాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sunday,August 05,2018 - 01:39 by Z_CLU

కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అదే టైమ్ లో టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్ చేశారు.

ఈనెల 7న (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు దేవదాస్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు నాగ్. అదే రోజు సాయంత్రం మరో ఇంట్రెస్టింగ్ ఎనౌన్స్ మెంట్ కూడా చేయబోతున్నారు.

సినిమాలో దేవా, దాస్ మంచి ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్ షిప్ డే రోజున ఈ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ లో ఓ కలర్ ఫుల్ మందు బాటిల్ పెట్టి, 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇది ఓపెన్ అవుతుందంటూ టీజ్ చేశారు.

వైజయంతీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు.