బాలీవుడ్ సింగం3 లో కొత్త హీరో

Tuesday,August 08,2017 - 05:36 by Z_CLU

సూర్య సింగం ఫ్రాంచైజీ తెలుగు, తమిళ భాషల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో బాలీవుడ్ లోను అంతే సక్సెస్ అయింది. ఇప్పుడు సింగం 3 ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సింగం 3 లో హీరో మారిపోయాడు.

బాలీవుడ్ సింగం సెన్సేషనల్ హిట్టనిపించుకుంది. ఆ తరవాత సింగం 2 కి కూడా దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి అజయ్ దేవ్ గన్ హీరోగా, స్టోరీలో చిన్న చిన్న చేంజెస్ చేసి అదే రేంజ్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు తెరకెక్కబోయే సింగం3 లో హీరో అజయ్ దేవ్ గన్ కాదు.

బాలీవుడ్ సింగం 3 లో అజయ్ దేవ్ గన్ కి బదులు సన్నీడియోల్ హీరోగా నటించనున్నాడు. ఇకపోతే సింగం 3 రోహిత్ శెట్టి డైరెక్షన్ లో కాకుండా, రవి K. చంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాకి జయంతి లాల్ గాదా నిర్మాత.