క్రిష్ మణికర్ణికలో సోనుసూద్

Tuesday,August 08,2017 - 03:53 by Z_CLU

క్రిష్ ‘మణికర్ణిక’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో సదాశివ అనే క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు సోనుసూద్. ఈ సినిమాని కమాల్ జైన్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో సైనికుడిలా కనిపించనున్న సోనుసూద్ సినిమాలోని కొనీ కీలక సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమీపుత్ర శాతకర్ణీ లాంటి హిస్టారికల్ సినిమా తరవాత క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం చాలా ఎగ్జైటెడ్ గా ఉందని చెప్పుకున్నాడు సోనుసూద్.