స్మాల్ స్క్రీన్ చరిత్రలో అతిపెద్ద ప్రీమియర్

Saturday,April 13,2019 - 11:34 by Z_CLU

ఇప్పటివరకు బుల్లితెరపై ఎన్నో ప్రీమియర్స్ చూశాం. కానీ ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ అతిపెద్ద వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్ధమైంది. భారత్ లోనే భారీ బడ్జెట్ చిత్రం 2.O… ఈరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మీ జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది.

2.0 – WorldTelevisionPremiere

here it is #2PointOTeluguPremiere #2point0 This Saturday at 5.30 pm only on #ZeeTelugu

Posted by Zee Cinemalu on Monday, 8 April 2019

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో గ్రాఫిక్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అక్షరాలా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం విడుదలకాని రేంజ్ లో దాదాపు 14 భాషల్లో 45 దేశాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజైంది.

ఇప్పుడీ మూవీని ఎక్స్ క్లూజివ్ గా జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో చూడొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 2.O సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.