ప్రారంభమైన బన్నీ-త్రివిక్రమ్ సినిమా

Saturday,April 13,2019 - 11:30 by Z_CLU

క్రేజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో మొదలైంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది

హారిక-హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలక్ట్ చేశారు. ఓ కీలక పాత్ర కోసం టబును అనుకుంటున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. తమన్ ఈ సినిమాకు కంపోజర్. ఈ మూవీలో మోస్ట్ స్టయిలిష్ గా కనిపించబోతున్నాడు. బన్నీ. ఇప్పటికే హెయిర్ స్టయిల్ మార్చేశాడు. స్లిమ్ అయ్యాడు కూడా.