భరత్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Monday,May 20,2019 - 05:40 by Z_CLU

‘ఆనందం’ , ‘వెంకీ’ , ‘రెడీ’ సినిమాల్లో మాస్టర్ భరత్ కామెడికి నవ్వని వారుండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు అందుకున్న భరత్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. యాక్టర్ గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ABCD సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న భరత్ తో ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ.

స్టడీస్ వల్లే

చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాక.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీస్ మీద దృష్టి పెట్టాను. ఇంజినీరింగ్ పూర్తి చేసాను. ప్రస్తుతం ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో డబుల్ డిప్లొమా చేస్తున్నాను. స్టడీస్ వల్లే సినిమాలకు బ్రేక్ తప్ప… మరో ఉద్దేశ్యం లేదు. ‘సైజ్ జీరో’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాను. సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అవకాశం వచ్చిన వదులుకోకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటాను.

నా విషయంలో అదే జరిగింది

వెంకీ,రెడీ సినిమాల్లో నేను చేసిన చైల్డ్ క్యారెక్టర్స్ ని గుర్తుపెట్టుకొని ఆడియన్స్ ఇప్పటికీ నన్ను వాళ్ళింట్లో పిల్లాడిలా ట్రీట్ చేస్తారు. ABCD షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంత మంది నన్ను చూసి చిట్టి నాయుడు బాగున్నావా.. అంటూ పలకరించారు. క్యారెక్టర్ కి కనెక్ట్ అయితే ప్రేక్షకులు ఎప్పటికీ ఆ నటుణ్ణి మర్చిపోరు. నా విషయంలో అదే జరిగింది.


రెస్పాన్స్ అదిరింది

ABCD లో నేను చేసిన భాషా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి హ్యాపీ గా ఫీలయ్యాను. అందరూ కలిసి చూసే ఎంటర్టైనర్ ఫిలింలో ఫుల్లెంత్ క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , అలాగే శిరీష్ గారికి థాంక్స్.

 

 

ఎంజాయ్ చేస్తున్నారు

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. సినిమాలో శిరీష్ గారికి నాకు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లో మా సీన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కో- ఇన్సిడెంట్

ABCD సినిమాకి నన్ను అప్రోచ్ అయ్యే ఒక్క రోజు ముందే శిరీష్ గారు నటించిన ఒక్క క్షణం చూసాను. ఆ సినిమా బాగా నచ్చింది. కో ఇన్సిడెంట్ గా కొన్ని రోజులకే శిరీష్ గారితో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. పైగా త్రూ అవుట్ సినిమా  ఆయనతోనే.

బెస్ట్ క్వాలిటీ…

నేను చెప్పొచ్చో లేదు తెలియదు. శిరీష్ గారిది చిన్నపిల్లల మెంటాలిటీ. ఆయనలో కల్మషం లేని ఓ చిన్నపిల్లాడు కనిపిస్తాడు. చాలా జెన్యూన్ పర్సన్. నచ్చితే విపరీతంగా ఇష్టపడతారు. కోపమయినా ప్రేమయినా దాచుకోలేరు. మనసులో ఏం పెట్టుకోరు. శిరీష్ గారిలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అది.

కంఫర్టబుల్ డైరెక్టర్

సంజీవ్ గారు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్… ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుంది. యాక్టర్ కి ఫ్రీడం ఉంటే మంచి అవుట్ పుట్ వస్తుంది. సంజీవ్ గారు నాకు చాలా ఫ్రీడం ఇచ్చి నా నుండి బెస్ట్ తీసుకున్నారు. ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలనుంది.

చాలా మార్పులున్నాయి

ABCD రీమేక్ అయినప్పటికీ చాలా చేంజెస్ చేసారు. ఒరిజినల్ సినిమా మళయాళం నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుంది. అందుకే తెలుగు వెర్షన్ కి చాలా మార్పులు చేసారు. సినిమా లైన్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే తీసుకున్నారు. మన నేటివిటీ కి తగ్గట్టుగా కొన్ని మార్పులతో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసారు.

కిక్కుండదు

ఒరిజినల్ సినిమాలో జాకోబ్ గ్రేగ్ నా క్యారెక్టర్ చేసారు. మళయాళంలో అయన పెద్ద నటుడు. సినిమాలో ఆయన టైమింగ్ తో వచ్చే కామెడీ సీన్స్ భలే పేలాయి. సేం టు సేం ఆయనలా కాకుండా ఆ క్యారెక్టర్ ని కాస్త డిఫరెంట్ గా నా టైమింగ్ తో చేయాలనుకున్నాను. నిజానికి అక్కడే మన టాలెంట్ తెలిసేది. ఒక నటుడు చేసిందే మనమూ చేస్తే యాక్టింగ్ లో కిక్కుండదు.

ప్లాన్స్ లేవు

ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నటుడిగా నాకెలాంటి ప్లాన్స్ లేవు. నిజానికి నటుడిగా ఇంత వరకూ వస్తానని ప్రేక్షకులకు దగ్గరవుతానని ఊహించలేదు. అంత అమ్మ నాన్న ఆశీస్సులు, దేవుడి ఆశిస్సులతోనే ముందుకెళతాను.

కథలు వింటున్నా …

హీరోగా సినిమాలు చేసేందుకు  కొన్ని కథలు వింటున్నాను. ప్రస్తుతానికి నాకు వచ్చిన క్యారెక్టర్స్ ఒప్పుకుంటున్నాను. హీరోగానే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వలేదు. వచ్చిన ప్రతీ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తూ చేసేస్తుంటా.

ప్రస్తుతం… అదొక్కటే

ప్రస్తుతానికి రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో నటిస్తున్నాను. ఆ సినిమాలో రాజ్ తరుణ్ కి మేనేజర్ గా ఉండే ఓ క్యారెక్టర్ చేస్తున్నా. ఎంటర్టైన్ మెంట్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. రాజ్ తరుణ్ ఒక బ్రదర్ లా కలిసిపోయాడు. ప్రస్తుతానికి ఇదొక్కటే చేస్తున్నా. మునుముందు మరిన్ని కామిక్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేస్తాను.