మహేష్ మరో ఫారిన్ ట్రిప్

Monday,May 20,2019 - 04:24 by Z_CLU

టైం దొరికితే ఫ్యామిలీతో గడపడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు మహేష్. అది కూడా ఇక్కడ కాదు. కుటుంబంతో కలిసి ఏదో ఒక దేశానికి ఎగిరిపోతాడు. ఈసారి కూడా మహేష్ కు టైమ్ దొరికింది. వెంటనే విమానం ఎక్కేశాడు. “మరో మెమొరబుల్ హాలిడే.. ఈసారి మరింత ప్రత్యేకం” అంటూ ట్వీట్ చేసి మరీ విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్.

తన కెరీర్ లో 25వ చిత్రంగా చేసిన మహర్షి హిట్ అవ్వడంతో మహేష్ ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఆ ఆనందాన్ని ఇలా హాలిడే ట్రిప్ రూపంలో ఫ్యామిలీతో కలిసి షేర్ చేసుకోబోతున్నాడు. అతడు ఏ దేశంలో ల్యాండ్ అయ్యాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నిజానికి ఈ ట్రిప్ ఇప్పటిది కాదు. 2 వారాల కిందటే ప్లాన్ చేశాడు. కాకపోతే మహర్షి ప్రమోషన్ కోసం ట్రిప్ ను కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా మహర్షి ప్రమోషన్ కోసం థియేటర్లకు కూడా వెళ్లాడు. వరుసపెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రీసెంట్ గా బెజవాడలో జరిగిన సక్సెస్ సంబరాల్లో కూడా పాల్గొన్నాడు. అలా ప్రచారం మొత్తాన్ని పూర్తిచేసి ఇప్పుడు కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లాడు.