భరత్ అనే నేను మూవీ 2 వారాల వసూళ్లు

Friday,May 04,2018 - 06:15 by Z_CLU

మహేష్, కొరటాల కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. ఈ 2 వారాల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఇప్పటికే 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఈ మూవీ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సెంటర్ లో స్టడీగా వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఈ 2 వారాల్లో వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 90 కోట్ల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో వంద కోట్ల రూపాయల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు భరత్.

ఏపీ నైజాం 14 రోజుల షేర్

నైజాం – రూ. 20.23 కోట్లు
సీడెడ్ – రూ. 10.08 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.21 కోట్లు
ఈస్ట్ – రూ. 6.47 కోట్లు
వెస్ట్ – రూ. 3.89 కోట్లు
గుంటూరు – రూ. 7.80 కోట్లు
కృష్ణా – రూ. 5.43 కోట్లు
నెల్లూరు – రూ. 2.45 కోట్లు