రేపే భాగమతి టీజర్ రిలీజ్

Tuesday,December 19,2017 - 03:04 by Z_CLU

అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన సినిమా భాగమతి. ఈ మూవీ టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఆమధ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపులో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

భాగమతి రిలీజ్ డేట్ ను కూడా ఇంతకుముందే ఎనౌన్స్ చేశారు. జనవరి 26న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఆది పినిశెట్టి, టబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.