నాని ఇంటర్వ్యూ

Tuesday,December 19,2017 - 02:52 by Z_CLU

డిసెంబర్ 21 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది నాని MCA. మిడిల్ క్లాస్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక కీ రోల్ ప్లే చేసింది. తన కెరీర్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందంటున్నాడు నాని

అలాంటివే సెలక్ట్ చేసుకుంటున్నా

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వచ్చేసరికి నేనేదో స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. నిజానికి ఒక కథ విన్నప్పుడు, ఆ కథని, నా క్యారెక్టర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసుకున్నప్పుడు నేను నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో చూసుకుని ఎంజాయ్ చేయగలను అనిపించిన స్టోరీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను బిగినింగ్ నుండి చేసేదదే… కాకపోతే అప్పుడు వర్కవుట్ అవలేదు. ఇప్పుడు వర్కవుట్ అవుతుంది అంతే…

MCA లో యాక్షన్ ఉండదు…

ఈ సినిమాలో నిజానికి యాక్షన్ ఉండదు. స్టోరీలో అసలు యాక్షన్ కి పెద్ద స్కోప్ లేదు.

అవసరం వచ్చినప్పుడే హీరో…

మన సినిమాల్లో హీరో అనగానే బిగినింగ్ నుండే స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ మెంట్ ఉంటుంది. కానీ MCA లో అలా కాదు. చాలా నార్మల్ గా ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ దికామ్ద్ చేసినప్పుడు హీరోలా రియాక్ట్ అవుతాడు…

MCA ఫార్మాట్ వేరు…

ఒక్కో సినిమా ఒక పర్టికులర్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకుని ఉంటుంది. అందరికీ అన్ని సినిమాలు నచ్చవు… MCA ఒక ఫార్మాట్ ఉన్న సినిమా… ఆ ఫార్మాట్ మెజారిటీ ఆడియెన్స్ కి నచ్చేస్తుంది. మేం అనుకున్నది ఎఫెక్టివ్ గా చెప్పామా లేదా అనేది మరో 2 రోజుల్లో తెలిసిపోతుంది….

ప్రతీది నమ్మేలా ఉంటుంది…

MCA సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ని నమ్మేస్తాం… నా క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, హీరోయిన్, అన్నయ్య.. ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్ గా నమ్మేలా ఉంటుంది. క్యారెక్టర్స్ నమ్మేలా ఉంటాయి కాబట్టి వాటి చుట్టూ క్రియేట్ అయ్యే ప్రతి ఇమోషన్ కి ఈజీగా కనెక్ట్ అవుతారు.

నేనెప్పుడూ ఫేమ్ ని నమ్ముకోలేదు…

 నేనెప్పుడూ టాప్ డైరెక్టర్స్  తోనే సినిమా చేయాలి రూల్ పెట్టుకోలేదు. అయినా ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు పేరున్న డైరెక్టర్స్ తో చేయడం అవసరం అనిపిస్తుంది. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు, మన సినిమాలు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నప్పుడు డెఫ్ఫినేట్ గా కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అని నా ఫీలింగ్…

సాయి పల్లవి ఆదరగొట్టేసింది

సాయి పల్లవి ఉన్న సీన్స్ సినిమాలో హైలెట్ అవుతాయి. తనున్న ప్రతి సీన్ లో డిఫెరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు…

వరంగల్ లో షూట్ చేయడం వల్లే…

నిజంగా వరంగల్ ఎఫెక్ట్ రావాలంటే సెట్స్ వేసి కూడా షూట్ చేసేయొచ్చు.. కానీ పర్టికులర్ గా ఆ లొకేషన్ కి వెళ్లి ఇన్నిరోజులు షూట్ చేయడం వల్ల రియల్ ఫీలింగ్ వచ్చేసింది. భూమిక గారు నేను సినిమా అయిపోయే లోపు  సొంత వదిన మరుదులంత క్లోజ్ అయిపోయాం… భూమిక చాలా స్వీట్ ఆక్ట్రెస్…

ఇప్పుడిప్పుడే అలవాటవుతుంది…

మారుతి గారు ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకి ‘న్యాచురల్ స్టార్’ అని ట్యాగ్ చేస్తాను అని చెప్పినప్పుడు నో అని చెప్పాను.. కానీ చివరికి పెట్టేశారు… ఆ తరవాతి సినిమాల్లో కూడా నేను నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నా.. ఈ లోపు పెట్టేస్తున్నారు… బిగినింగ్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా, ఇప్పుడిప్పుడే  కొద్దిగా అలవాటవుతుంది.

అలాంటి కథలెవరూ చెప్పట్లేదు…

కమలహాసన్ గారు చేసిన మహానది, భారతీయుడు లాంటి సినిమాలు చేయాలంటే నాకూ ఇష్టమే కానీ ఇప్పటి వరకు నాకలాంటి కథలు చెప్పలేదు. అలాంటి గొప్ప నటులు వాళ్ళ కరియర్ లో చూపించిన వేరియేషన్స్ లో సగానికి సగం చూపించుకున్నా, జన్మ ధన్యం అయినట్టే….

అందుకే ‘అ!’ నిర్మించా…

అద్భుతమైన స్టోరీ విన్నా.. డైరెక్టర్ తో ఈ సినిమా ఎలా చేస్తావ్ అన్నప్పుడు కొత్త ఆర్టిస్టులతో, కొత్త ప్రొడ్యూసర్స్ తో చేస్తాను అన్నాడు. స్టార్ వ్యాల్యూ లేకుండా, ఈ సినిమా బావుందని తెలియడానికి మినిమం 15 రోజులు పడుతుంది. కానీ వారం రోజుల్లోగా సినిమాని థియేటర్స్ లోంచి తీసేస్తారు.. అందుకే ఈ కథకి మంచి ప్రొడక్షన్ ప్లాట్ ఫామ్ కావాలి కాబట్టి ఎగ్జైట్ మెంట్ తో ఈ సినిమాని నిర్మించా…

అదే ‘అ!’…

సైన్స్ ఫిక్షన్, హారర్, థ్రిల్లర్ ఇలా చెప్పుకుంటూ ఒక ఐదారు జోనర్స్ ఉన్న సినిమా ‘అ!’.

నాగార్జున గారితో సినిమా…

ఇంకా ఫైనల్ నేరేషన్ వినాల్సి ఉంది. అది అయ్యాకే ఈ సినిమా గురించి డెసిషన్ తీసుకోవడం కానీ, అనౌన్స్ చేయడం కానీ ఉంటుంది.

కృష్ణార్జున సినిమా గురించి…

చాలా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. రెండు క్యారెక్టర్స్ ఒకరికి మరొకరు కంప్లీట్ గా విరుద్ధంగా ఉంటారు. సినిమా చాలా బాగా తెరకెక్కుతుంది.