భేతాళుడు బంపర్ హిట్

Friday,November 18,2016 - 02:40 by Z_CLU

అదేంటి… భేతాళుడు సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. అప్పుడే హిట్ అని ఎలా చెబుతాం. నిజమే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాానీ ఇది హిట్టే. దీనికి కారణం విడుదలకు ముందే ఈ సినిమా సంచలనం సృష్టించడం ఒకటైతే.. తెలుగు ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూడ్డం మరో రీజన్. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు సంబంధించి 10 నిమిషాల వీడియోను అఫీషియల్ గా నెట్ లో పెట్టారు. ఆ వీడియో చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. అంతలా అది అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

బిచ్చగాడుతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో విజయ్ ఆంటోనీ… తన నెక్ట్స్ మూవీ భేతాాళుడు కోసం ఈ రిస్కీ ప్రచారాన్ని ప్రారంభించాడు. విడుదలకు ముందే, ఆడియో ఫంక్షన్ రోజు.. సినిమా టైటిల్స్ నుంచి 10 నిమిషాల మూవీని నెట్ లో పెట్టాడు. ఆ ప్రమోషనల్ ఎలిమెంట్ సూపర్ హిట్ అయింది. నెట్ లో 10నిమిషాల మూవీ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అలా భారీ అంచనాల మధ్య డిసెంబర్ ఫస్ట్ వీక్ లో భేతాళుడు థియేటర్లలోకి రానుంది.